
రాప్తాడులో రౌడీ రాజ్యం
అవసరమైతేనే సిజేరియన్ చేయండి
కదిరి టౌన్: పట్టణంలోని మూర్తిపల్లి, నిజాంవలీ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగేంద్రనాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. కదిరి ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ , లేబర్ వార్డును తనీఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీలో భాగంగా శిల్పా నర్సింగ్ హామ్‌ను తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్‌ను విజిట్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
చేనేత వ్యాపారుల భూమి కబ్జాకు ‘తమ్ముళ్ల’ యత్నం
● కంచె ధ్వంసం చేసి
బెదిరించారన్న వ్యాపారులు
ధర్మవరం అర్బన్: తమ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చేనేత వ్యాపారులు వాపోయారు. పట్టణంలోని తారకరామాపురంలోనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న సదరు భూమిలో శుక్రవారం వారు సమావేశం నిర్వహించారు. వ్యాపారులు పోలా వెంకటనారాయణ, పోలా ప్రభాకర్ మాట్లాడుతూ 2005లో 3.15 ఎకరాలు కొనుగోలు చేసి మగ్గాలు పెట్టామన్నారు. 2014లో కోర్టు కమిషనర్ ద్వారా సర్వే చేయించి కంచె వేయించామన్నారు. ఈనెల 5న టీడీపీ నేత కొత్తపేట ఆది, అతని అనుచరులు పది మంది వచ్చి జేసీబీతో భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించి దౌర్జన్యం చేశారన్నారు. బీరుసీసాలతో వచ్చి పొడిస్తే మీకు దిక్కు ఎవరంటూ బెదిరించారని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లామని, తమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. భవిష్యత్తులో చేనేతల జోలికి ఎవరొచ్చినా తిరగబడతామని హెచ్చరించారు. పట్టుచీరల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గిర్రాజు రవి, మహిళా నేత జయశ్రీ, తొగటవీరక్షత్రీయ సంఘం అధ్యక్షుడు రాము, చేనేత ప్రముఖులు గడ్డం శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడా నిర్భందాలు చేయలేదు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీ వారిని పిలిపించి అక్రమ కేసులు బనాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రౌడీ రాజ్యం నడుస్తోంద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో కురుబ బాలన్న అనే యువకుడిని టీడీపీ వారు కట్టెలతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. సిద్ధరాంపురం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి వెళ్తుంటే దాదులూరు వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు వచ్చి అడ్డుకుని బందోబస్తు ఇవ్వలేమని పర్యటన వాయిదా వేసుకోవాలంటూ చెప్పారన్నారు.
పోలీసులు ప్రజల కోసమా..
సునీత కోసమా?
పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ కోసం పని చేస్తున్నారా? లేదంటే టీడీపీని బలపరిచేందుకు పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లికి వస్తే పెద్దపెద్ద గొడవలు అవుతాయని రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ చెబుతున్నారని, ఆయన టీడీపీ ఏజెంటుగా పని చేస్తున్నారా? అని నిలదీశారు. ఊరిలో లేని సమస్యను సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వాళ్లకు లేని ఉద్దేశాలను ఎస్‌ఐ కల్పిస్తూ ఎస్పీ, డీఎస్పీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు స్టేషన్‌కు వెళ్తే అగౌరవంగా మాట్లాడటడంతోపాటు కింద కూర్చోమని చెబుతారని ఎస్‌ఐ సుధాకర్‌యాద్‌పై మండిపడ్డారు.
సీఐ, ఎస్‌ఐలు
పద్ధతులు మార్చుకోవాలి..
అనంతపురం రూరల్ మండలంలోని తమ పార్టీ నేతలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పుట్టపర్తిలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్లడంతో వారికి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. జనాలను బాగా పిలుచుకెళ్లిన లీడర్లను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ చుట్టంగా మార్చొద్దని పోలీసులకు హితవు పలికారు. తాను గుండీలు ఇప్పుతా రా కొట్లాడదామని రాప్తాడు సీఐ పిలుస్తారని, ఆయన సీఐనా రౌడీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో లాఅండ్ ఆర్డర్ సమస్యంతా ఇటుకలపల్లి సీఐతోనే ఉత్పన్నమవుతోందన్నారు. తోపుదుర్తిలో 30 మంది ఇంట్లోకి దూరి మహిళపై దాడి చేస్తే..బాధితులపైనే కేసు కడతాడన్నారు. వారి ఆగడాలు చూస్తూ ఊరుకున్నారంటే తాము సంయమనం పాటించమని చెప్పడమే కారణమనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికై నా ఇటుకులపల్లి, రాప్తాడు సీఐలు, రామగిరి ఎస్‌ఐ పద్ధతులు మార్చుకోవాలని హితవుపలికారు.
చట్టాన్ని టీడీపీ చుట్టంగా
మార్చుతున్న పోలీసులు
ఏకపక్షంగా వె ళ్తామంటే
చూస్తూ ఊరుకోం
రైతుల సమస్యలపై రాజీ పడను.. జైలుకు వెళ్లేందుకూ సిద్ధం
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
చంద్రబాబు, సునీత
చరిత్రహీనులుగా నిలిచిపోతారు..
లైనింగ్‌పనులు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని, దీనిపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ పనులు జరిగితే చంద్రబాబు, పరిటాల సునీత చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు. నియోజకవర్గ రైతుల సమస్యలపై రాజీ పడననని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. సిద్ధరాంపురం గ్రామానికి చెందిన బాధితుడు కురుబ బాలన్నను పరామర్శించడానికి వెళ్లనీయకపోవడంతో ఇక్కడికే బాధితుడిని పిలిపించి మీడియాకు చూపించారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నేత కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనరు బాలపోతన్న, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, రామగిరి కన్వీనర్ మీనుగ నాగరాజు పాల్గొన్నారు.

రాప్తాడులో రౌడీ రాజ్యం