‘విజన్–2047’ ఓ మాయ
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి విజన్ –2047 పేరుతో మాయ చేసేందుకు పూనుకుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం బకాయిలు చెల్లించాలని, హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని, హిందూపురంలోని ప్రీకాట్ మిల్లు కార్మికులను ఆదుకోవాలంటూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని సీఎం చంద్రబాబు పీ–4 అంటూ కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. పేదలు గుడిసెలు వేసుకుంటే జేసీబీలతో తొలగించే ప్రభుత్వం.. కూటమి నాయకులతో మాత్రం విచ్చలవిడిగా భూ కబ్జాలకు తెరతీసిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపడితే అడ్డుకుంటామన్నారు. ప్రీకాట్ మిల్లు కార్మికులు వీధిన పడకుండా ఆదుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శ్మశాన వాటికలు కేటాయించాలన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, పంటల సాగుకు నీరు అందివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదిర్శ వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేషులు, నాయకులు హరి, జంగాలపల్లి పెద్దన్న, దిల్షాద్, జెడ్పీ శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, పెద్దన్న, పవన్, పైపల్లి గంగాధర్, పెడపల్లి బాబా, పలువురు మహిళలు పాల్గొన్నారు.
ప్రజాసమస్యలు పరిష్కరించకుంటే
ఆందోళనలు ఉధృతం చేస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
Comments
Please login to add a commentAdd a comment