ట్రాక్టర్ దూసుకెళ్లి చిన్నారి దుర్మరణం
పావగడ: ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఓ చిన్నారి దుర్మరనం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పావగడ తాలూకా వైఎన్ హొసకోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిక్కజాలోడు గ్రామానికి చెందిన వరుణ్ (6) తిమ్మమ్మనహళ్లిలోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అటుగా మట్టి లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. ఘటనలో ట్రాక్టర్ చక్రాల కింద నలిగి వరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వైఎన్ హొసకోట పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ మాళప్ప నాయక్కొడి తెలిపారు.
కానిస్టేబుల్ మురళి ఆత్మహత్యాయత్నం
కదిరి టౌన్: స్థానిక పీఎస్‌లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మురళి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాప్తాడు మండలం జంగాలపల్లికి చెందిన మురళి... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఓడీసీ మండలం డబురువారిపల్లికి చెందిన కల్పనను ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధమైన ఆమెను కోచింగ్ కోసం రెండు నెలల క్రితం అనంతపురానికి పంపాడు. పరీక్ష రాసిన తర్వాత నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్తతో దూరంగా ఉంటూ వచ్చింది. పలుమార్లు కాపురానికి రావాలని పిలిచినా ఆమె అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన మురళి... మంగళవారం రాత్రి వైఎస్సార్ నగర్‌లో తాను నివాసముంటున్న ఇంట్లోనే పురుగులు మందు సేవించాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను పక్కింటి వారు గమనించి, వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ట్రాక్టర్ దూసుకెళ్లి చిన్నారి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment