
గిరిజన మహిళలకు సంక్షేమాన్ని వివరిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి
మెళియాపుట్టి: గిరి శిఖరంపై ఉన్న హడ్డివాడ గిరిజన గ్రామాన్ని కాలినడకనవెళ్లి అక్కడి గిరిజనంతో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోమవారం మమేకమయ్యారు. మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని హడ్డివాడకు సరైన రోడ్డు లేదు. దీంతో కాలినడకన కొండపైకి ఎక్కిన ఆమె గిరిజనులను కలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పథకాలు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజలెక్కడుంటే అక్కడికి ప్రజాప్రతినిధులే వచ్చి బాగోగులు చూస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు బాగోలేదని సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ త్వరలోనే రోడ్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యుడు గూడ ఎండయ్య, మండల నాయకులు బైపోతు ఉదయ్‌కుమార్, పోలాకి జయమునిరావు, సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు సరోజినమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు పాపారావు, రాజారావు, జమ్మయ్య పాల్గొన్నారు.
హడ్డివాడలో గిరిజనులతో మమేకమైన ఎమ్మెల్యే రెడ్డి శాంతి
Comments
Please login to add a commentAdd a comment