ఆశలు గల్లంతు
● సముద్రంలో గల్లంతైన గ్రూప్–2 అభ్యర్థి ● రాజమ్మతల్లి జాతర స్నానాల్లో అపశృతి ● మరో నలుగురిని కాపాడిన మైరెన్ పోలీసులు
గార: మండలంలోని చిన్న వత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జి.సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మైరెన్ పోలీసులు స్పందించి తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకురాగలిగారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. అశోక్ ఎంఎస్సీ పూర్తి చేసి, ఇటీవలే గ్రూప్–2 పరీక్షలు రాశాడు. తండ్రి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గార ఎస్‌ఐ ఆర్.జనార్దన కేసు నమోదు చేశారు. కాగా, ఇదే ప్రాంతంలో చీపురుపల్లి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన చందక వంశీ, పిన్నింటి జయలక్ష్మీ, పిన్నింటి దిలీప్ సముద్ర స్నానానికి దిగి చిక్కుకుపోతున్న తరుణంలో మైరెన్ ఎస్‌ఐ హరికృష్ణ టీం సభ్యులు గమనించి రక్షించారు. లైఫ్ జాకెట్లు ఉపయోగించి నీటిలో ఇబ్బందులు పడుతున్న ముగ్గురినీ ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేశారు.
ఆశలు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment