అన్నయ్యపై తమ్ముడి దాడి
టెక్కలి రూరల్: మండల కేంద్రం టెక్కలిలోని రెల్లివీధి సమీపంలో పరపటి వినోద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అంబేడ్కర్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వైపుగా భార్యాపిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్లడం ఆదివారం స్థానికంగా కలకలం రేపింది. తలపై రక్తాలు కారడంతో ఏమైందని అడిగినా స్పందించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ విజయ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని, తమ్ముడు బాల అన్నయ్య వినోద్‌ను కర్రతో కొట్టి గాయపరిచాడని తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
అ‘పూర్వ’ సమ్మేళనం
కొత్తూరు : కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1970–71 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాల ఆవరణలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 55 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలిసి ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ హెచ్‌ఎం ఎద్దు గోపాలదాసునాయుడుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
అన్నయ్యపై తమ్ముడి దాడి
Comments
Please login to add a commentAdd a comment