స్నానానికి బావిలో దిగి..
● డిప్లమో విద్యార్థి మృతి ● గోపినాథపురంలో విషాదఛాయలు
టెక్కలి రూరల్: మండలంలోని గోపినాథపురం గ్రామానికి చెందిన బెండి దీపక్ అలియాస్ కుమారస్వామి (17) ఆదివారం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో స్నానానికి దిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్నేహితులు బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుమారస్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారస్వామి ఎచ్చెర్లలో పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. చేతికందిన కుమారుడు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment