ద్విచక్ర వాహనం దగ్ధం
వజ్రపుకొత్తూరు రూరల్:
అక్కుపల్లి శివసాగర్ తీరంలో శనివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై నిహర్ ఆదివారం సంఘటన స్థలానికి వెళ్లి వాహనాన్ని పరిశీలించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ద్విచక్రవాహనం కొత్తూరు మండలానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించామని చెప్పారు.రెండు రోజులు క్రితం షోరూమ్‌కు అప్పగించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఇదే వాహనాన్ని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు.. ఎందుకు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment