పలాసలో వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం
కాశీబుగ్గ: కోస్తా ఆంధ్రా, తెలంగాణలో తమకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వైభవ్ జ్యూయలర్స్ నూతన బ్రాంచిని పలాసలో గొప్పగా ప్రారంభించింది. పలాస–కాశీబుగ్గ కేటీ రోడ్డులో ఆదివారం వైభవ్ జ్యూయలర్స్ 19వ బ్రాంచిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంస్థ 19 బ్రాంచ్‌లు ఏర్పాటు చేసిందంటే కొనుగోలుదారుల ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. వ్యాపారంతో పాటు సుమారు 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. వైభవ్ సంస్థల సీఎండీ భారత మల్లికా రత్నకుమారి గ్రంథి మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, అనంతపురం, అమలాపురం, యలమంచిలి, దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్‌నగర్, మంచిర్యాల తదితర చోట్ల బ్రాంచిలు ఏర్పాటు చేసిందన్నారు. వైభవ్ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, వెండి వస్తువులు, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
మన పలాస గురించి తెలుసుకుందాం కాంటెస్ట్ డ్రాలో గెలుపొందిన ఏడుగురు విజేతలకు ఒక్కొక్కరికి 1 గ్రాములు 22 క్యారెట్ బంగారు కాయిన్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాష్యూ ట్రేడర్ మళ్లా కాంతారావు, హోల్‌టైమ్ డైరెక్టర్ సాయి కీర్తన గ్రంధి, సీఓఓ గొంట్ల రాఖాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి వెంకటేష్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్, పలాస వైశ్య సంఘం అధ్యక్షుడు మల్లా కృష్ణరావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, చిన్ని, శాసనపురి మోహనరావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment