తాగునీటి ట్యాంకులో వ్యక్తి మృతదేహం
టెక్కలి రూరల్: టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో వ్యక్తి మృతదేహం బయటపడటం శుక్రవారం కలకలం రేపింది. కె.కొత్తూరు సమీపంలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మెస్‌లో మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న పాలకొల్లుకి చెందిన చందనాల స్వామి(42) ఈ 12న తన ఊరు వెళ్తానని చెప్పి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ శుక్రవారం సాయంత్రం ఆదిఆంధ్రవీధి సమీపంలోని రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే ఉన్న ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. టెక్కలి పట్టణానికి సరఫరా అయ్యే తాగునీటిలో మృతదేహం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment