దామోదరం సంజీవయ్యకు నివాళులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం సంజీవయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి శాంతిశ్రీ, ఎస్‌డీసీ పద్మావతి, అప్పారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విశ్వ మోహన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment