అరుదైన చెట్టుపిల్లి గుర్తింపు
సారవకోట: మండలంలోని వడ్డినవలస సమీప పొలాల్లో అరుదైన చెట్టు పిల్లిని గ్రామస్తులు శుక్రవారం గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ ఎస్‌ఎఫ్‌ఓ లక్ష్మిపురం ఈశ్వరరావు, బీట్ అధికారి శివ ప్రసాద్ గ్రామానికి చేరుకుని చెట్టుపిల్లిని సారవకోట సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్టులో వదిలారు. అరుదైన అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తే వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.
ఉద్యోగాల పేరిట మోసం
టెక్కలి రూరల్: తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సంతబొమ్మాళికి చెందిన పందిరి అప్పన్న, సన్యాసమ్మ దంపతులు శుక్రవారం టెక్కలి గొల్లవీధిలో ధర్నా చేపట్టారు. ఇద్దరు దివ్యాంగు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి టెక్కలి గొల్లవీధికి చెందిన ఓ మహిళ రూ.18లక్షల 60 వేలు తీసుకుందన్నారు. నేటికీ తిరిగివ్వలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. డబ్బులు తిరిగివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటు సన్యాసమ్మ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పోలీసులు చొరవతో గొడవ సద్దుమణిగింది. ఇదే విషయమై టెక్కలి సీఐ విజయ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. కేసు కోర్టులో ఉందని తెలిపారు.
ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ బాలురు హ్యాండ్‌బాల్ జట్టు ఎంపికలు శుక్రవారం ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రపోటీలకు ఎంపికయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పాత్రునివలస క్రీడామైదానం వేదికగా జరిగిన ఈ ఎంపికలకు సీనియర్స్ మహిళలకు అరకొరగా హాజరుకావడంతో.. కేవలం జూనియర్స్ బాలురుకు మాత్రం ఎంపికలు నిర్వహించారు. మొత్తం 45 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులతో కూడిన తుది జాబితాను త్వరలో వెల్లడిస్తామని శ్రీకాకుళం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను ఈ నెల 21 నుంచి 23 వరకు కర్నూలు జిల్లా జిల్లా డీఎస్‌ఏ క్రీడామైదానం వేదికగా జరగనున్న 10వ ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రవిశేఖర్, డి.ఈశ్వరరావు, ఆర్.సతీష్‌రాయుడు, ఎల్.డిల్లేశ్వరరావు, డీఎస్‌ఏ కోచ్ ఎల్.అనీల్, లక్ష్మణరావు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మార్చి 24,25 తేదీల్లో
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
శ్రీకాకుళం అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షించాలని, సిబ్బందిని సకాలంలో నియమించాలని కోరారు. పని ఒత్తిడి పెరగడం, డిజిటలైజేషన్ అందుబాటులో ఉన్నందున వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు తెరవాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల స్థానంలో శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. 12వ వేతన సవరణలో భాగంగా మిగిలి ఉన్న డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కృష్ణ కిషోర్, మండ శ్రీనివాసరావు, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
అరుదైన చెట్టుపిల్లి గుర్తింపు
అరుదైన చెట్టుపిల్లి గుర్తింపు
అరుదైన చెట్టుపిల్లి గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment