ప్రాణం తీసిన లాంగ్‌డ్రైవ్ సరదా
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై బైక్‌పై లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ గమ్యం చేరాలనుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. బైక్ అదుపు తప్పడంతో మృత్యువు వెంటాడింది. భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్య గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిషేక్ బెహరా (40) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బాలాసూర్ కుర్దా నుంచి భార్య అన్నయ్‌పార్థన్‌తో కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై బెంగళూరు పయనమయ్యాడు. హెల్మెట్‌తో పాటు టూర్ కిట్‌తో సకల జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయతీ నవభారత్ నగర్‌కాలనీ సమీపంలోకి వచ్చేసరికి బైక్ స్కిడ్ కావటంతో అభిషేక్ బెహరాకు తీవ్ర గాయాలు కాగా, భార్య అన్నయ్‌పార్థన్ స్వల్పంగా గాయపడింది. స్థానికులు అందించిన సమాచారంతో 108 సర్వీస్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం అభిషేక్ బెహరా మృతి చెందారు. అన్నయ్ పార్థన్‌కు ప్రాణాపాయం తప్పింది . మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైవేపై అదుపు తప్పిన బైక్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. భార్యకు గాయాలు
ప్రాణం తీసిన లాంగ్‌డ్రైవ్ సరదా
Comments
Please login to add a commentAdd a comment