థర్మల్ ప్లాంట్‌తో సహజ వనరులు నాశనం
సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ కేంద్రం పేరుతో సహజ వనరులను నాశనం చేయవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శుక్రవారం గిరిజనులు, ఆదివాసీలతో కలిసి వెన్నెలవలసలోని థర్మల్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తుందని, వారి హక్కులకోసం జరిగే పోరాటానికి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే గిరిజన పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయం, పచ్చని పంట పొలాలు నాశనం కావడంతో పాటు గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. అన్ని వర్గాలు థర్మల్ వ్యతిరేక పోరాట ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర న్యాయ సలహాదారు చౌదరి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, థర్మల్ విద్యుత్ కేంద్రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ఉద్యమ నేతలు బీన జ్ఞానేశ్వరి, ఢిల్లీశ్వరి, తామాడ అప్పలస్వామి, పొందర మురళి, వైఎస్సార్‌సీపీ నేతలు ఖండాపు గోవిందరావు, అత్తులూరి రవికాంత్, దుంపల శ్యామలరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల ఉద్యమానికి మద్దతు
ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్
Comments
Please login to add a commentAdd a comment