ఆదివాసీలపై దాడులు అమానుషం
పలాస: ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న సైనిక బలగాల దాడులను తక్షణమే నిలుపుదల చేయాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీపార్టీతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల పేరుతో అడవుల్లో ఉన్న మూలవాసులను తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలను దేశ ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.మాధవరావు, సి.పి.ఐ జిల్లా కార్యదర్శి చాపర వేణు, సి.పి.ఐ.ఎం. నాయకులు కోనారి మోహనరావు, లిబరేషన్ నాయకుడు తామాడ సన్యాసిరావు, పత్తిరి దానేసు, జోగి కోదండరావు, సాలిన వీరాస్వామి, మద్దిల ధర్మారావు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, బర్ల జానకమ్మ, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి అరుణ, కోనేరు రమేస్, సార జగన్, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment