సేకరించిన శాంపిల్స్ ఇవే
●
సేకరించిన
శాంపిల్స్,
మిషనరీలు
● అంతుచిక్కని కిడ్నీ వ్యాధి మూలాలు
● శాంపిల్స్ సేకరించినా పరిశోధన ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
● అటు ప్రభుత్వ ధనం వృధా..
ఇటు వ్యాధి గ్రస్తులకు క్షోభ
● కిడ్నీ వ్యాధులపై విధి విధానాలు లేని కూటమి ప్రభుత్వం
కాశీబుగ్గ:
పచ్చటి ఉద్దానాన్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న కిడ్నీ సమస్య మూలాలు తెలుసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇక్కడ కిడ్నీ చావులు అతి సాధారణమైపోయిన దయనీయ స్థితి నెలకొంది. రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీవ్యాధిని ప్రభుత్వాలు నియంత్రించలేక పోతున్నాయి. పోతు న్న ప్రాణాలను డయాలసిస్‌తో కొద్ది రోజులు ఆపగలుగుతున్నారు తప్పితే మనుషులను మాత్రం కాపాడలేకపోతున్నారు. అలాంటి ఉద్దాన ప్రాంతంలో గత పదేళ్లుగా పలు సంస్థలు, బృందాలు పరిశోధనలు జరుపుతున్నాయి తప్పితే కారణం తెలపలేకపోతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అమెరికా నుంచి శాస్త్రవేత్తలను తీసుకువచ్చి శాంపిల్స్ సేకరించామని చెప్పింది. కానీ ఇన్ని రోజులైనా వాటి ఫలితాలేమిటో ఎవరూ చెప్పలేకపోయారు.
ఎప్పటికప్పుడు పరిశోధనలు..
ఉద్దానంలో చాలా ఏళ్లుగా చాలా బృందాలు పరిశోధనలు జరుపుతున్నాయి. కానీ ఇతిమిద్దంగా ఇదీ కారణం అంటూ ఏమీ చెప్పలేకపోయాయి. 2019 వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యాధి పరిశోధనలకు రంగం సిద్ధం చేసింది. డయాలసిస్ యూనిట్‌లు పెంచడం, రూ.పదివేల పింఛన్లు కూ డా అందజేసింది. 2024లో వచ్చిన కూటమి ప్రభు త్వం కిడ్నీ వ్యాధి గ్రస్తుల ప్రాంతాల్లో జార్జ్ యూనివర్సిటీ వారితో వివిధ రకాల శాంపిల్స్ సేకరించినప్పటికీ ఇంతవరకు ఫలితాలు వెల్లడించలేదు. ఇదే చాలా మందిని కలవరపెడుతోంది.
పలాసలోని కిడ్నీ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు పొందుతున్న రోగులు
ఫలితాల కోసం
ఎదురు
చూస్తున్నాం
పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో సుమారు 807 గ్రామాలలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు 20 వేల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ప్రాథమిక కేంద్రాలు, 6 సామాజిక ఆస్పత్రులు ఉన్నాయి.
ఉద్దాన ప్రాంతంలో ప్రజలు తాగుతున్న నీటి శాంపిల్స్, వాడుకలకు వాడుతున్న నీరు, పంట పొలాలకు ఉపయోగిస్తున్న నీటి శాంపిల్స్ సేకరించారు.
రక్తంలో ఉన్నటువంటి సీరం, ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎ, ప్లాస్మా వంటివి వ్యాధి గ్రస్తుల నుంచి సేకరిస్తున్నారు.
వ్యాధి గ్రస్తుల నుంచి సేకరించిన యూరిన్‌ను పరీక్షలకు పంపించారు.
ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వ్యాధి గ్రస్తుల జుట్టు, మట్టి శాంపిల్స్ అమెరికాకు పంపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు రాకపోవడం అందరూ విస్తుపోతున్నారు.
పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో నాల్గో అంతస్తు మొత్తం పరిశోధనలకు కేటాయించాం. అక్కడ జార్జ్ యూనివర్సిటీ వారు పరిశోధనలు జరుపుతున్నారు. ఇటీవల జుత్తు, మట్టి శాంపిల్స్ రసాయ శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఉద్దానంలో పర్యటించి వాటిని అమె రికా తీసుకుని వెళ్లారు. వారి నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. మేము ఉన్నత అధికారులను కలిసి వారిని సంప్రదించి వారి నుంచి కిడ్నీవ్యాధికి గల కారణాలు తెలిస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి వెల్లడిస్తాం. అంతవరకు ఏమీ చెప్పలేం.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం
సేకరించిన శాంపిల్స్ ఇవే
సేకరించిన శాంపిల్స్ ఇవే
Comments
Please login to add a commentAdd a comment