టీనేజర్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: యుక్త వయస్సులో ఉన్న మహిళలపై వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంతో ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలపై కారణాలను విశ్లేషించి ప్రతి సీడీపీఓ ఒక కేస్ స్టడీతో తర్వాత నెల జరి గే సమీక్షా సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు ఆధార్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు వివరాలను విశ్లేష ణ చేసి నివేదికలు సమర్పించాలని తెలిపారు.
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సఃప్రదాయం ప్రకారం సూపరింటెండెంట్ కనకరాజు, అర్చకులు ఇప్పిలి క్షేమేంద్ర శర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ఇటీవల జరిగిన కుంభసంక్రమణ అభిషేక పూజల వివరాలను వివరించారు.
మార్చి 8న
జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసి, జిల్లాలో గల పెండింగ్ కేసులను తగ్గించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు భవనంలో శుక్రవారం పోలీస్ అధికారులు, బీమా కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, మూ డో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాల్గో అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎల్ ఫణి కుమార్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కోడిగుడ్లు, మాంసంపై అపోహలు వద్దు
పాతపట్నం: కోడిగుడ్లు, కోడిమాంసంపై అపోహలు వద్దని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) డాక్టర్ కంచరాన రాజగోపాల్‌రావు అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణలో భాగంగా శుక్రవారం జేడీ పాతపట్నం, వసుంధర రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పశుసంవర్ధశాఖ సిబ్బందికి బర్డ్ ఫ్లూ నియంత్రణపై సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాధిని గోదావరి జిల్లాలోని కోళ్లలో నిర్ధారించడంతో ఇక్కడ కూడా తనిఖీ లు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్‌ఫ్లూ నమోదు కాలేదని, జిల్లాలోని కోళ్లలో అసాధారణ మరణాలు కూడా లేవని తెలిపా రు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యలలో భా గంగా జిల్లాలోని కోళ్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇతర జిల్లా లు, రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణాపై స్థానిక చెక్‌పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతటా రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేసి, ఎలాంటి సందర్భంలోనైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
టీనేజర్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
టీనేజర్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment