అక్రమాల జాతర
వంశధార నదిలో డీ–సిల్టేషన్ ర్యాంపులోకి వేసిన అక్రమంగా వేసిన రాచబాట
గార: గార మండల కేంద్రంలోని డీ సిల్టేషన్ ర్యాంపులో ఇసుక అక్రమాల జాతర జరుగుతోంది. దీనికి అధికారులే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచా రు. కళింగపట్నం– పాలకొండ రోడ్డుకు ఆనుకొని ఉన్న డీ–సిల్టేషన్ ర్యాంపులో ఇష్టానుసారం ఇసు క తరలింపు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుకపై అనేక జీఓలు విడుదలతో పాటు స్వయానా ముఖ్యమంత్రి సైతం ఇసుక వాహనాలు ఆపవద్దు అని బహిరంగంగా నే వ్యాఖ్యానించారు. అదే వరమై వాల్టా వంటి చట్టాలు సైతం మంటగలుపుతూ ఇక్కడ ఇసుకను తవ్వి తోడేస్తున్నారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయిప్రత్యూష రిజర్వ్‌డ్ పోలీసుల సాయంతో ర్యాంపును తనిఖీ చేశారు. స్వయానా మండల అధికారుల టీమ్‌తో పరిశీలించారు. వంశధార నదిలో ఉన్న రెండు హిటాచీలను సీజ్ చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వాటి తాళాలను గార పోలీసులకు అప్పజెప్పారు. ఇది లా ఉండగా ఈ ర్యాంపు సమీపంలోనే రక్షిత మంచినీటి పథకంతో పాటు పదుల సంఖ్యలో వ్యవసాయ పంపుసెట్లు, నది గట్టు చెంతనే ఆర్ అండ్‌బీ రోడ్డు ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జీఓ ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ నుంచి ఒకరు, మైన్స్ శాఖ నుంచి ఒకరు ఉండి ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో వచ్చిన వాహనాలకు ఇసుకను ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ అమలు కావడం లేదని గుర్తించారు. ఎవరూ వస్తున్నా ముందుగానే సంబంధిత శాఖలకు తెలియడంతో అంతా గప్‌చిప్‌గా జరిగిపోతోంది. సీజ్ చేసిన తర్వాత కూడా శుక్రవారం ఉదయం హిటాచీలు స్టాక్ చేసిన ఇసుక వద్దనే ఉన్నాయి. వీటి తాళాలు మాత్రం గార పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా.. ఎప్పటి మాదిరిగా పలు ఖాళీ వాహనాలు మాత్రం ఇసుక కోసం ఎదురు చూస్తుండటం కొసమెరుపు.
అక్రమాల జాతర
అక్రమాల జాతర
Comments
Please login to add a commentAdd a comment