ఉపాధి ఉద్యోగులపై వేధింపులు సరికాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఉన్నతాధికారి తీ రుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలి, సమయ పాలన లేకపోవడంతో ఉద్యో గులం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉపాధి పథకంలోని వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సుధాకర రావు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు ఉద్యోగులు డచ్ భవనం వద్ద సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందిని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులందరినీ దోషులుగాను, దొంగలుగా భావించి మాట్లాడడం సరికాదన్నారు. కార్యాలయంలో రాత్రి సమయాల్లో పనులు పురమాయించడం, రాత్రి వేళల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ వ్యక్తి గత జీవితాలకు భంగం కలిగిస్తున్నారని వాపోయా రు. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో వేతనాలు క ల్పించి జిల్లాకు 400 కోట్ల రూపాయలు మెటీరియ ల్ కాంపోనెంట్ నిధులను సమకూర్చిన ఘనత ఈ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందికి దక్కుతుందని అన్నారు. కానీ నిత్యం అవమానాలతో కించపరిచే విధంగా మాట్లాడడం, సంక్రాంతి పర్వదినాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. సామాజిక తనిఖీ ఆడిట్లో జరిమానా లు, రికవరీలు విపరీత స్థాయిలో ఉంటున్నాయని వీటిని కుదించాలని వివక్ష చూపించడం సరికాదని వారు పేర్కొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధి కారి వెంకటేశ్వరరావుకు కూడా వినతిపత్రాన్ని ఉపాధి హామీ ఉద్యోగులు కలెక్టరేట్‌లో అందజేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు వైవీ రమణ, అమ్మి నాయుడు, జయరాం, తవిటి నాయుడు, తెంబూరు రవి, అరుణ్ కుమార్, ప్రేమ లత, ప్రమీల, రత్నాకర్, ధర్మారావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment