ఒక్క రోజే 300 ట్రాక్టర్లతో..
పోలాకి: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కోడూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 15–4 లో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మండల పరిషత్ ఆధీనంలోని జీడిమామిడి తోటలో విలువైన మట్టి తరలింపు సర్వత్రా చర్చనీయాంశమైంది. శుక్రవారం ఒక్కరోజే 300 వందల ట్రాక్టర్లు వరకు మట్టిని ఎత్తేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలం అందులోనూ మండల పరిషత్ ఆధీన స్థలంలోనే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కోడూరు పరిసర ప్రాంతాల్లో లభించే ఎర్రమట్టికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న సారవంతమైన ఇసుకతో కూడిన మట్టి కావటంతో ఇప్పుడు దీనిపై అందరి కన్ను పడింది. రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమంగా లేఅవుట్‌లు వేసి ఈ మట్టితో పంట పొలాలను చదును చేస్తుండటంతో మరింత డిమాండ్ పెరిగింది. ఈ ఎర్రమట్టిలో ఎలాంటి మొక్క వేసినా ఆరోగ్యవంతంగా పెరుగుతుందని అంటారు. ఇలాంటి మట్టిని నేరుగా జేసీబీలు పెట్టి అక్రమంగా తరలించుకుపోతూ లక్షలరూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment