గంజాయి రవాణా గుట్టురట్టు
కాశీబుగ్గ: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు ఒడిశా వాసులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. శనివారం కాశీబుగ్గ పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంజాం జిల్లా బురైపహాడా గ్రామానికి చెందిన బిక్రమ్ మండల్, సునంద సవరలు 8 కేజీల గంజాయిని ముంబై తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు రాగా పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా, ఒడిశా రాష్ట్రం గండాహాతి వాటర్ ఫాల్స్ సమీపంలో గంజాయిని పండించి అందులో మూడు కేజీల అమ్మేందుకు పలాస రైల్వేస్టేషన్‌కు వచ్చిన గంగవైన ఉదయకుమార్, గౌరవ్ పొరివా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని కలిసేందుకు వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు. రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
ఆరు కేజీల గంజాయితో..
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అంతర్భఅదవచుడంగపూర్ గ్రామానికి చెందిన మిలన్ పరిచ్ఛా అనే యువకుడు అదే రాష్ట్రానికి చెందిన చంద్రు అనే వ్యక్తి వద్ద 6.220 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు.
బరంపురంలో బస్సు ఎక్కి ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనంతరం బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. ముంబైలో గంజాయి వ్యాపారి ప్రేమానంద్‌మల్లిక్‌కు అందజేసేందుకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సమావేశంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment