ముగిసిన రహదారి భద్రతా మాసోత్సవాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రహదారి భద్రతపై పలువురు నిపుణులు, అధికారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో 889 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 285 మంది మరణించగా, 1043 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ విజయసారథి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, డీఎంహెచ్‌ఓ టీవీ బాలమురళీకష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్‌రావు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు పి.వి.గంగాధర్, ఆర్.అనిల్, మున్సిపల్ ఇంజినీర్ దక్షిణామూర్తి, నెహ్రూ యువ కేంద్రం కో–ఆర్డినేటర్ ఉజ్వల్, రవాణా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు వీరే :
క్విజ్: కె.లోహిత(కేజీబీవీ, గార), ఎస్.రేఖ(కేజీబీవీ, గార), బి.రాజానందిని (శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం), జి.హితేష్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం).
వ్యాసరచన: టి.హారిక (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), ఎ.సూర్య (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), పి.రేణుశ్రీ (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), కె.రాము (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), జె. ఝాన్సీరాణి (సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), జె.హోయ్ (9వ తరగతి) – సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), యు.మానస (సెయింట్ క్లారెట్), డి.సింధూర (సెయింట్ క్లారెట్), కె.హారిక (బీఎస్సీ, గాయత్రీ కళాశాల, మునసబ్‌పేట), ఎం.జోష్నవి (గాయత్రీ కళాశాల), డి.మేనక (గాయత్రీ కళాశాల), టి.తైవేన్ (ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం), హాసిని (డిగ్రీ)(ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం)
Comments
Please login to add a commentAdd a comment