గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
నందిగాం: మండలంలోని కొత్తగ్రహారం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పలాస మండలం రేగులపాడుకు చెందిన దాసరి భీమయ్య(65) నందిగాం మండలం భోరుభద్రలోని బంధువుల ఇంట్లో జరగనున్న గావు సంబరం కోసం కాలినడకన బయలుదేరాడు. కొత్తగ్రహారం వద్దకు వచ్చేసరికి టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన భీమయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భీమయ్యకు భార్య తులసమ్మ, వివాహమైన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి బైక్‌పై వెళుతున్న ఉపాధ్యాయుడు సింగూరు శ్రీనివాసరావు శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దోమాం పంచాయతీ బమ్మిడివానిపేటకు చెందిన ఈ ఉపాధ్యాయుడు కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలోని సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. బస్సు బ్రేక్ వేయటంతో ఉపాధ్యాయుడు రోడ్డుపై పడిపోయారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment