శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Published Sun, Feb 16 2025 1:05 AM | Last Updated on Sun, Feb 16 2025 1:05 AM

శ్రీక

శ్రీకాకుళం

లక్కీచాన్స్‌సిక్కోలు బౌలర్‌కు లక్కీ చాన్స్‌ వచ్చింది. మెక్‌గ్రాత్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. –8లో

ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

పైడిబీమవరం చెక్‌పోస్టు వద్ద నిలిపిన లారీలను జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ శుక్రవారం తనిఖీ చేయగా నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా నిర్ధారణ జరిగిన

వాహనాలివి. 28 లారీలను తనిఖీ చేస్తే వాటిలో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా చేసున్నట్టుగా తేలింది. బట్టేరు, బైరి, కాఖండ్యాం, గార

ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకతో

అక్రమంగా వస్తున్నట్టుగా గుర్తించారు.

విచారణ 24కు వాయిదా

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో తొలగించిన 34 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు లేబర్‌ కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జనవరి 2న ఫిర్యా దు చేయగా, పలు వాయిదాలు పడ్డాయి. శ్రీకాకుళం డే అండ్‌ నైట్‌ కూడలిలోని లేబర్‌ కమిషన్‌ కార్యాలయంలో శనివారం విచారణ నిర్వహించాల్సి ఉండగా, ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. విచారణ రోజున ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ సర్వీస్‌ ఏజెన్సీ, వర్సిటీ అధికారులు హాజరు కావాలని సూచించారు.

వేకువజామున

ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

నరసన్నపేట: రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ సమర్థంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. అలాగే జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ వాహన సిబ్బంది కూ డా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శనివారం వేకువజామున ఆయన నరసన్నపేట పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. అప్ప టికి స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని నైట్‌ డ్యూటీలు, నైట్‌ పెట్రోలింగ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్యవరం కూడలి వద్ద జాతీయ రహ దారి పెట్రోలింగ్‌ పోలీసు వాహన సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్‌ మరింత సమర్థంగా నిర్వహించాలన్నారు.

రాజమ్మ తల్లి జాతర

రెండోవారం ప్రారంభం

గార: మండలంలోని చినవత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం జాతర శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి రాత్రికి విడిది చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ శాఖ 130 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. వత్సవలస గ్రామాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద సాయంత్రం పరిశీలించి బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవ్‌టీజింగ్‌, పిక్కాట, పేకాటలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుకను ఇష్టాను సారం తరలిస్తున్నారు. జేసీ ఆకస్మిక తనిఖీలతో ఈ విషయం బట్టబయలైంది. ఇన్నాళ్లూ లోప భూయిష్టమైన తనిఖీల కారణంగానే నకిలీల గుట్టు రట్టు కాలేదు. వాస్తవానికి జిల్లాలో నకిలీ బిల్లులతో ఇసు క రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. పత్రికల్లోనూ అనేక మార్లు కథనాలు వచ్చాయి. ఇందులో ఓ అధికారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఉన్న ఫలంగా రూ.లక్షలు గడించారన్న ఆ రోపణలు సైతం ఉన్నాయి. విశాఖలోని బిల్డర్లు, లారీల యజమానులతో కుమ్మకై ్క, జిల్లాలో ఉన్న పలు ఇసుక ర్యాంపులతో ఒప్పందాలు కుదుర్చు కుని పథకం ప్రకారం నకిలీ బిల్లులతో ఇసుక రవా ణా చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిల్లులు లేకుండా కూడా సరిహద్దు దాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విశాఖ సంబంధాలతో...

ఈ అధికారికి విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలోని ఇసుక ర్యాంపుల నిర్వాహకుల తో కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా రు. ముందుగానే ముడుపుల వ్యవహారం కుదుర్చు కుని పథకం ప్రకారం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసినప్పుడు వ్యూహాత్మకంగా ర్యాంపుల్లో ఓ ప్రత్యేక పరికరంతో తయారు చేసిన బిల్లులు చూపించి దాటించేస్తున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపుల వద్ద ఏ రోజుకారోజు ఏయే లారీ నంబర్లతో అధికారికంగా ఇసుక తరలివెళ్తుందో తెలిపే డేటాతో కూడి న లాగిన్‌ చెక్‌ పోస్టు సిబ్బంది వద్ద ఉండటం లేదు. దీంతో నకిలీ బిల్లులు గుర్తించలేకపోతున్నారు.

ఎక్కడికక్కడ అనధికారిక ర్యాంపులు

జిల్లాలో అధికారిక ర్యాంపులతో పాటు టీడీపీ నేత ల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అన ధికార ర్యాంపులు కొనసాగుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కొందరు నేతలు కోట్లాది రూపాయలు గడించారు. ఇప్పటికే జిల్లాలో రూ. 500కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందన్న వాదనలు ఉన్నా యి. పగటి పూట కంటే రాత్రిపూటే ఎక్కువగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు ఇసుక లారీల జాతరే జరుగుతోంది. దీన్నివల్ల పల్లెల్లో రోడ్లు శిథిలమవ్వడమే కాకుండా లారీ ల రాకపోకలతో ఎప్పుడే ప్రమాదం చోటు చేసుకుంటుందోనన్న భయం కూడా గ్రామాల్లో ఉంది.

క్యాష్‌ చేసుకుంటున్న అధికారి

అనధికార ర్యాంపుల్లో జరుగుతున్న ఇసుక రవా ణాను ఓ అధికారి క్యాష్‌ చేసుకుంటున్నాడు. అటు విశాఖ బిల్డర్లు, లారీ యజమానులతోనూ, ఇటు ర్యాంపుల నిర్వాహకులను డీల్‌ కుదుర్చుకుని పక్కా వ్యూహం ప్రకారం జిల్లా నుంచి ఇసుక దాటించేస్తున్నారు. చెక్‌ పోస్టు వద్ద ఉన్న కదలికలు ఆ అధికారికి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా తన అధికారాన్ని ఉపయోగించుకుని జిల్లా నుంచి ఇసుకను సేఫ్‌గా దాటించేస్తున్నారు. తనిఖీలు జరిగినప్పుడు అధికారులపై నాయకుల పేర్లు చెప్పి ఒత్తిడి తీసుకువచ్చి లారీలు విడిపించుకుంటున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలతో ఎప్పటి నుంచో సాగుతున్న అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. నకిలీ బిల్లుల బాగోతం బయటపడింది. అయితే బిల్లుల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సి ఉంది.

ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల

సమావేశం నేడు

ఆమదాలవలస: ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో.. 2003 డీఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో ఆది వారం శ్రీకాకుళం పట్టణంలోని కళింగ భవన్‌లో నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కొత్తకోట శ్రీహరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2004 వ సంవత్సరానికి ముందు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల ఉద్యోగ నియామకాలను ఆలస్యం చేశాయని తెలిపారు. అలాగే పాత పింఛన్‌ అమలు చేయాలని కోరారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో మూడు జిల్లాల బాధిత ఉద్యోగులు తప్పని సరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అక్రమంగా పీడీఎస్‌ బియ్యం

తరలింపు

సంతబొమ్మాళి: కోటబొమ్మాళికి చెందిన ఒక వ్యాపారి తన వ్యాన్‌లో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మర్రిపాడు వద్ద కొంత మంది యువకులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. వ్యాన్‌లో సుమారు 40 బస్తాల బియ్యం ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్‌ఐ ప్రసన్న, మర్రిపాడు వీఆర్‌ఓ ఉమాపతికి ఫోన్‌లో సమాచారం ఇచ్చినా ఘటనా స్థలానికి రాలేదు. సుమారు గంటన్నరకు పైగా పీడీఎస్‌ బియ్యం ఉన్న వ్యాన్‌ను అడ్డుకున్నా రెవెన్యూ అధికారులు రాకపోవడంపై స్థానికులు అసహ నం వ్యక్తం చేశారు.

న్యూస్‌రీల్‌

ఇసుక అక్రమ రవాణాకు సూత్రధారిగా ఓ అధికారి

విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో ఒప్పందం

జిల్లా నుంచి ఇసుక అక్రమ

తరలింపునకు సహకారం

భారీగా అందుతున్న ముడుపులు

జేసీ తనిఖీలతో నకిలీ బిల్లుల గుట్టురట్టు

పైడిభీమవరం చెక్‌ పోస్టు వద్ద ఇసుక లారీలు ఆపుతున్నారని తెలుసుకుని యూబీ పరిశ్రమ ఎదుట, నెలివాడ,

వరిసాం, పైడి భీమవరం ఫ్లై ఓవర్‌కు ముందు నిలిపివేసిన లారీలివి. దాదాపు 50 ఇసుక లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పక్కాగా బిల్లులు ఉంటే ఆపేవారు కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీకాకుళం1
1/4

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/4

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/4

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/4

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement