
దేవుడా.. ప్రమాదం తప్పింది
● చెరువులో పడిపోయిన స్కూల్ బస్సు ● స్థానికుల స్పందనతో నిలబడిన విద్యార్థుల ప్రాణాలు ● ఐదుగురు విద్యార్థులకు గాయాలు
కాశీబుగ్గ: మందస మండలం ఉమాగిరి వద్ద స్కూల్ బస్సు శనివారం చెరువులో పడిపోయింది. బస్సులో ముప్పై మంది ఉండగా.. ఐదుగురు గాయపడ్డారు. మిగతా వారు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మందస మండల కేంద్రంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులతో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మందస నుంచి భైరిసారంగిపురం, బెల్లుపటియా, పెడంగో, బుడార్సింగి గ్రా మాలకు బయల్దేరింది. ఉమాగిరి వద్ద చెరువు పక్కన కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్న ప్రదేశంలో.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి బస్సు చెరువులో పల్టీ కొట్టింది. దీంతో పిల్లలంతా ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. అక్కడున్న స్థానికులు వెనువెంటనే స్పందించి పిల్లలను, బస్సు సిబ్బందిని బయటకు తీశారు. చెరువులో నీరు తక్కువగా ఉండ డంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ బుడార్సింగి, పెడంగో గ్రామాలకు చెందిన ఐదు మంది విద్యార్థులు ఎన్.ధీరజ్, ఎన్.లోకేష్, పవి త్ర పట్నాయక్, హర్షిత, మహేష్ గౌడ్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉమాగిరి వాసి శిష్టు బాబ్జితో పాటు స్థానికులు రక్షించారు. 108 సాయంతో గాయపడిన వారిని మందస మండలం హరిపురం ప్రభుత్వ సామా జిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డాక్టర్ ఐశ్వర్య, రాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

దేవుడా.. ప్రమాదం తప్పింది
Comments
Please login to add a commentAdd a comment