కారులో మంటలు
టెక్కలి: మండలంలోని నరసింగపల్లి సమీపంలో ఆదివారం ఓ కారు నుంచి హఠాత్తుగా మంటలు రావడంతో యజమాని గమనించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన బెండి ఉదయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో పర్లాఖిమిడి వైపు వెళ్తుండగా, నరసింగపల్లి సమీపంలో రోడ్డుపై వేసిన మినుము మొక్కలు ఇంజిన్‌లోకి వెళ్లి రాపిడికి మంటలు వ్యాపించాయి. ముందుగా పొగలు రావడంతో గమనించిన ఉదయ్ ఒక్కసారిగా అప్రమత్తమై కారును నిలిపివేసి హుటాహుటినా కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం గ్రామస్తుల సాయంతో మంటలపై నీరు చల్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ఇంజిన్, అడుగు భాగం దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment