వ్యక్తి ఆత్మహత్య
ఇచ్ఛాపురం రూరల్: మద్యానికి బానిసైన వ్యక్తి గెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురం గ్రామానికి చెందిన పైల నూకయ్య(58) మద్యానికి బానిసయ్యాడు. శారీరక సమస్యలతో బాధపడుతూ రెండు రోజుల క్రితం గ్రామానికి కొంత దూరంలో ఉన్న దండుగెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం శవమై తేలడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. నూకయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐఎఫ్‌ఈఏ చీఫ్ ప్యాట్రన్ కె.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(1938) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అద్యయన తరగతులు నిర్వహించారు. ఏపీటీఎఫ్ కార్యకర్తలకు ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నూతన విద్యా విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు బి.రవి, జిల్లా గౌరవ అధ్యక్షులు టెంక చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మద్యం బాటిళ్లు పట్టివేత
గార: ఉత్తరాంధ్రలో పేరున్న వత్సవలస రాజులమ్మ తల్లి యాత్రలో అనధికార మద్యం వ్యాపారం జోరందుకుంది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ యాత్రకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో అనధికార మద్యం వ్యాపారం జరగ్గా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 10 బాటిళ్లు, మరొక వ్యక్తి నుంచి 15 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు ఆర్.మహేష్‌బాబు, బి.రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఓల్డేజ్ హోమ్‌లో గుర్తు తెలియని బాలిక
బూర్జ: మండలంలోని పాలవలసలో సహాయమాత ఓల్డేజ్ హోమ్‌లో గుర్తు తెలియని బాలిక ఉందని, ఈమె వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్వాహకులు ఆదివారం బూర్జ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నరసన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అమ్మాయి గాయపడటంతో స్థానికులు కొందరు శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారని, కాళ్లు విరగడంతో కొన్ని రోజులు అక్కడే ఉంచి చికిత్స అందించారని, ఆమె ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని, కనీసం పేరు కూడా చెప్పడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిమ్స్ సిబ్బంది 2023 డిసెంబరు 31న ఓల్డేజి హోమ్‌లో చేర్పించారని, ఇంతవరకు బాలిక కోసం కుటుంబ సభ్యులు రాలేదని, వారి వివరాలు కనుక్కోవాలని కోరారు.
రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కాశీబుగ్గ: తిరుపతి–పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ తెలిపారు. విశాఖపట్నం వద్ద రైలు ఎక్కిన 40 ఏళ్ల తప్పతాగి ఉన్నాడని, పలాస రైల్వే స్టేషన్ వచ్చేసరికి మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడి వివరాలు లభించలేదని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment