ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న ఆటో పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా, మిగిలిన ముగ్గురూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన వీరంతా ఆటోలో నిమ్మాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌హెచ్ పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి తగిన సహాయం అందించారు.
మంత్రిని కలిసిన వెటర్నరీ సిబ్బంది
కాశీబుగ్గ: తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ వెటర్నరీ(1962) వాహనం సిబ్బంది ఆదివారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడం భావ్యం కాదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెటర్నరీ వాహనాల నిర్వహణ అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, 104లా చిన్న వాహనం పెట్టేందుకు ఆలోచిస్తున్నామని, జీవీకే సంస్థకు రూ. 150 కోట్ల బకాయి ఉందని తెలియజేశారు. ఈ సమస్యలన్నీ తేలాక మళ్లీ పిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం అన్యాయమని, ఉద్యోగుల కోసం నిరహార దీక్షలు చేస్తామని సీఐటీయూ అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు.
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment