ఉత్తరాంధ్ర మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వన్ స్టేట్ వన్ అసోసియేషన్ రాష్ట్ర అడహాక్ కమిటీ కన్వీనర్ కె.గోవిందరావు, రాష్ట్ర స్థాయి క్రియాశీలక నాయకులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు, రాజమండ్రికి చెందిన సీనియర్ మాజీ సైనికులు, న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్ హాజరయ్యారు. మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment