రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లో | - | Sakshi
Sakshi News home page

రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లో

Published Mon, Feb 17 2025 12:49 AM | Last Updated on Mon, Feb 17 2025 12:44 AM

రూల్స

రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు

తనిఖీలతో ఆగిన లారీలు

జిల్లాలోని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉన్నతాధికారులు సీరియస్‌

అక్రమ రవాణాను క్యాష్‌ చేసుకున్న అధికారిపైనే ప్రధానంగా ఫోకస్‌

సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం

అధికారికి లారీకి రూ. 2వేలు చొప్పున ముడుతున్నట్టు భోగట్టా

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

జిల్లా నుంచి అక్రమ ఇసుకను దగ్గరుండి సరిహద్దులు దాటిస్తున్న ‘లంచావతారం’పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సెలవు రోజైనా ఆదివా రం కూడా ఇదే విషయమై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అధికారి ఒక్కో లారీకి రూ.రెండేసి వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాంపులో ఇసుక ఎత్తినందుకు రూ.వెయ్యి, అక్రమ రవాణా చేసినందుకు రూ.వెయ్యి వసూలు చేసి లబ్ధిపొందుతున్నట్టు సమాచారం. జరుగుతున్న భాగోతంపై ‘సాక్షి’లో కథనం వచ్చాక విస్తృతంగా చర్చకు దారి తీసింది.

అధికారిక ర్యాంపులు ఏడే..

జిల్లాలో అధికారికంగా 11 ఇసుక ర్యాంపులు నడిచేవి. ఇందులో రీచ్‌లతో పాటు డీ సిల్టేషన్‌ ర్యాంపులున్నాయి. వీటిలో గార, ముద్దాడపేట, కాఖండ్యాం, బట్టేరు రీచ్‌లకిచ్చిన ఏడాది గడువు ముగిసింది. దీంతో అధికారికంగా నడుస్తున్నవి ఏడు రీచ్‌లే. కానీ, గడువు తీరిన రీచ్‌లతో పాటు అనధికారికంగా వంశధార, నాగావళి నదీ తీరం పొడవునా ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసు క ర్యాంపులు నడుస్తున్నాయి. మంచినీటి ఇన్‌ఫిల్టరేషన్‌ బావులు, సంపులు, వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వేసి తరలించేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో దూసి, ఇసుకలపేట, దిబ్బలపేట, తొగరాం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, పాతూరు, నారాయణపురం, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొరపాం, తోటాడ, సింగూరు, చెవ్వాకులపేట, సవలాపురం, శ్రీకాకుళం నియోజకవర్గంలోని బైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొన్నాం, బట్టేరు, నైరా, గార, నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీముఖలింగం, దొంపాక, లుకలాం, బుచ్చిపేట, ఉర్లాం, చేనులవలస, గోపాలపెంట, పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు, హిరమండలం మండలాల్లోని పలు గ్రామాల నదీ తీరంలో అక్రమంగా ఇసుక ర్యాంపులు నడిచాయి. దీంతో పాటు గడువు ముగిసిన గార, బట్టేరు, కాఖండ్యాం, ముద్దాడపేట రీచ్‌ల్లో కూడా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెళ్లి తనిఖీలు చేయడంతో వాటిలో కాస్త తవ్వకాలు ఆగాయి. రాత్రి పూట మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి.

అనధికార ర్యాంపుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్న 10టైర్ల లారీకి రూ. 12వేలు, 12టైర్ల లారీకి రూ. 14వేలు, 14టైర్ల లారీకి రూ. 16వేలు, 16టైర్ల లారీకి రూ. 18వేలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్‌ గ్రీవె న్స్‌కు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇలా మొత్తం తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టుగా అ క్రమ తవ్వకాలు, తరలింపులో నాయకులతో పాటు పలువురు భాగస్వామ్యం కావడంతో అక్రమ సొ మ్ముకు కక్కుర్తిపడే అధికారులకు పంట పండింది.

క్యాష్‌ చేసుకున్న ఆ అధికారి

అక్రమ రవాణా అరికట్టేందుకు కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి రణస్థలం మండలం పైడి భీమవరం సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యే క దళాలకు చెందిన సిబ్బందిని తనిఖీల కోసం నియమించారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా అక్రమ రవాణా సాగుతోంది. ఇక ఉదయం నకిలీ బిల్లుల సాయంతో వందలాది లారీలు జిల్లా దాటేస్తున్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని లంచావతారం ఎత్తిన ఓ అధికారి క్యాష్‌ చేసుకుంటున్నారు.

అక్రమార్కులతో అధికారికి లింకులు

విశాఖకు చెందిన లారీ యజమానులతో పాటు అనధికార ర్యాంపులు నిర్వహిస్తున్న నిర్వాహకులతో డీల్‌ కుదుర్చుకుని పథకం ప్రకారం జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇచ్ఛాపురానికి చెందిన ఓ లారీ య జమాని విశాఖలో ఉంటూ ఆయనకు బాగా సహకరిస్తున్నారు. ఆ యజమానికి సొంతంగా 13లారీలు ఉండటం, ఆ వ్యక్తికి లంచావతారమెత్తిన అధికారికి సన్నిహిత సంబంధాలుండటంతో ఈ యజమాని మరికొంతమంది లారీ యజమానులతో ఒప్పందం కుదిర్చి జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఇసుక కొరత ఉన్న మొదట్లో లారీకి రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు ముడుపులు తీసుకోగా, ప్రస్తుతం లారీకి రూ. 2వేలు చొప్పున తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇందులో సగం అక్రమ ర్యాంపుల నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

రికార్డెడ్‌గా రోజుకి 150నుంచి 180వరకు లారీలు తరలివెళ్తున్నట్టు తెలిసింది. అనధికారికంగా ఎన్ని లారీలు వెళ్తున్నాయో యజమానులకే తెలియాలి. ఇలా, రికార్డయిన అయిన లారీలను జా యింట్‌ కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేసేసరికి 28 లారీల్లో 12లారీలు నకిలీ బిల్లులతో తరలిస్తున్నట్టుగా గుట్టు రట్టు అయింది. సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీ చేస్తున్న విషయం తెలుసుకుని దానికి ముందు కొంత దూరంలో 50వరకు లారీలు చాలా సేపు నిలిచిపోయాయి. ఆ తర్వాత రణస్థలం, సతివాడ, రామతీర్థం మీదుగా మళ్లించేశారు. ప్రస్తుతం కూడా ఈ రూట్‌లోనే అక్రమ రవాణా సాగుతోంది.

జయహో.. రాజమ్మ తల్లి వత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం యాత్ర ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.

ఉన్నతాధికారి ఆరా

జిల్లాలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నకిలీ బిల్లులపై జిల్లా ఉన్నతాధికారి సీరియస్‌గా దృష్టిసారించారు. ముఖ్యంగా సరిహద్దులో లంచావతారం ఎత్తిన అధికారి కోసం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఎవరా అధికారి అని నిఘా వర్గాల ద్వారానే వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇసుక వ్యవహారంలో సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు 1
1/1

రూల్స్‌కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement