‘ఆదిత్యుడిని తలచుకున్నాకే పాట’
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నిత్యం తలచుకున్నాకే తన గీతాలాపన ప్రారంభమవుతుందని సినీ గాయని సునీత అన్నారు. ఆదివారం ప్రత్యేకంగా ఆమె సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్వామి ప్రసాదించిన ఆరోగ్యంతోనే గత రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో పాటలు పాడుతున్నానన్నారు. తన కెరీర్‌లో 9 నంది అవార్డులతో పాటు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్లో గుర్తింపు రావడం నిజంగా తన అదృష్టమన్నారు. అంతకుముందు సూర్యనమస్కారాల పూజల ను తిలకించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేదాశీర్వచనాన్ని అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ తదితరులు పాల్గొన్నారు.
‘థర్మల్ ప్లాంట్‌తో అభివృద్ధి బూటకమే’
సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం అంతా బూటకమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కు ల వేదిక కన్వీనర్ వీఎస్ కృష్ణ తెలిపారు. ఆదివారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసాన్‌పుట్టి, బొడ్లపాడు, తిమడాం, జంగాలపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశం నిర్వహించారు. పచ్చని పంటపొలాల్లో థర్మల్ ప్లాంట్ నిర్మాణ ఆలోచనలు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ నిర్మా ణం వల్ల వందలాది ఎకరాల పంట భూములతోపాటు, మానవాళి మనుగడే ప్రఽశ్నార్థకంగా మారుతుందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు 2050 నాటికి థర్మల్ ప్లాంట్లు మూసివేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కొత్తగా ఈ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చే స్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాబోయే ప్రమాదాన్ని ముందు గానే అరికట్టి, భావితరాల భవిష్యత్‌ను కాపా డుకోవాలంటే పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన విరమించేవరకు కలసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథం, ప్రసూనకర్త అనురాధ, జిల్లా కార్యదర్శి సురేష్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చౌదరి లక్ష్మణరావు, ఆదివాసీ సంక్షేమపరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వంకల మాధవరావు, థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్‌దొర, కార్యదర్శి అత్తులూరి రవికాంత్, కోశాధికారి సింహాచలం పాల్గొన్నారు.
అంధకారంలో మార్చురీ
టెక్కలి: టెక్కలి జిల్లా ఆస్పత్రికి చెందిన మా ర్చురీ విభాగం సుమారు నెల రోజులుగా అంధకారంలో ఉంది. పాత ఆస్పత్రికి ఆనుకుని ఉన్న మార్చురీ విభాగానికి చెందిన విద్యుత్ సరఫరా వైర్లను నెల రోజుల కిందట దుండగులు చోరీ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ విభాగానికి విద్యుత్ సరఫరా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక్కడ రెండు ఫ్రీజర్లు ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. అయితే దానికి సైతం విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో చీకటి పడిన తర్వాత తీసుకువచ్చిన మృతదేహాలను భద్రపరచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో తీసుకువచ్చిన మృతదేహాలతో పాటు కుటుంబ సభ్యులు రేయింబవళ్లు చీకట్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి మార్చురీ విభాగానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
‘ఆదిత్యుడిని తలచుకున్నాకే పాట’
‘ఆదిత్యుడిని తలచుకున్నాకే పాట’
Comments
Please login to add a commentAdd a comment