విద్యార్థుల జీవితాలతో ఆటలా?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనతో విద్యార్థుల బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయని వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజికవర్గ అధ్యక్షుడు దుంపల రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము విడుదల చేసి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కంటే అధికంగా ఇస్తానని చెప్పి అధికారం చేపట్టాక విద్యార్థులతో ఆడుకోవడం సీఎం చంద్రబాబుకు తగదన్నారు.
నిరుద్యోగ భృతి జాడే లేదని, సంపద సృష్టించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన అబద్దాల బాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సచివాలయాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి యువతను ఆదుకున్నట్లు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment