విశాఖ ఉక్కుపై బిల్లు పాస్ చేయించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేసి నిర్ణయం తీసుకోవాలని సమాజ వికాస సేవా సంఘం సభ్యులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో భూకుంభ కోణాలు, స్టీల్‌ప్లాంట్‌కు నాణ్యతలేని బొగ్గును సరఫరా చేసే అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పర్యావరణాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి బొడ్డేపల్లి సత్యనారాయణ, కె.గోపాల్, ఎస్.ధనుంజయ, ఎ.సత్యన్నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment