ఆమదాలవలస రూరల్: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్‌కుమార్ అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంభ సభ్యులు చెబుతున్నారు. చిట్టీ డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ చిట్టీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక సోమ వారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు, ఈ మేరకు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్.బాలరాజు వద్ద బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment