ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ మహాలక్ష్మీనగర్‌లో ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామి వెంకటేశ్వరి రణస్థలం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఆమె ఈ నెల 15న పర్లాకిమిడి వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి 7.45 గంటలకు ఇంటికి రాగానే తలుపులు పగులకొట్టి, తాళాలు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా తెరిచి ఉండటంతో వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.అవతారం ఇన్‌చార్జి ఎస్సై జి.లక్ష్మణరావులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం ఎస్సై భరత్ ఆధ్వర్యంలో సిబ్బంది రామారావు, శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ వివరాలు సేకరించారు. తులం బంగారం, 300 గ్రాముల వెండి పోయినట్లు ఉందని, ఇంకా పూర్తిగా చూడాల్సి ఉందని బాధితులు చెప్పారు. ఇంటి పరిసరాలు తుప్పలతో నిండి ఉండటం, చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనం సులువుగా జరిగిందని భావిస్తున్నారు.
జె.ఆర్.పురం పంచాయతీ
మహాలక్ష్మీనగర్‌లో ఘటన
రంగంలోకి దిగిన పోలీసులు
ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
Comments
Please login to add a commentAdd a comment