అంగన్‌వాడీలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి హెచ్చరించారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అంగన్‌వాడీలు సుదీర్ఘ పోరాటం చేశారని, ఆ సమయంలో కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, వారి ప్రభుత్వం ఏర్పడినా నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా 2019 నుంచి జీతాలు పెరగలేదన్నారు. దీనికితోడు యాప్‌లు, నూతన విధానాలతో పని భారాలు పెంచుతున్నారని వాపోయారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్‌వాడీ సమస్యలపై చర్చించాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్. ప్రకాష్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.జ్యోతి, జి.రాజేశ్వరి, కె.సంధ్యారాణి, అంజలీభాయ్, కృష్ణభారతి, లక్ష్మి, లక్ష్మినారాయణ, అంగన్‌వాడీలు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తాం
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా
అంగన్‌వాడీలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment