అయోడిన్ లోపంపై అవగాహన
అరసవల్లి: అయోడిన్ లోపంతో శరీరంలో వచ్చే మార్పులు, అనారోగ్య పరిస్థితులపై ఆశావర్కర్లు అవగాహన కలిగి ఉండాలని ఐ.జి.డి. జిల్లా కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆశా వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఇన్‌స్టిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయోడిన్ లోపంతో వచ్చే సమస్యలపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 40 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాంను ఐటీసీ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ట్రైనర్ డాక్టర్ ఎం.చైతన్య మాట్లాడుతూ అయోడిన్ లోపంతో థైరాయిడ్, క్రిటినిజం, ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, బలహీనం తదితర లోపాలు తలెత్తుతాయన్నారు. అయోడిన్‌తో కూడిన ఉప్పును మాత్రమే వినియోగించాలని, ఆకుకూరలు, గుడ్లు, పాలు, బీన్స్, క్యార ట్, బెల్లం, పండ్లను తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ, జిల్లా ఐజీడీ కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment