శ్రీముఖలింగంలో పట్టాభిషేకం
జలుమూరు: దక్షిణ కాశిగా పేరొందిన శ్రీముఖలింగంలో సోమవారం కళింగరాజు అనంత వర్మ చోడ గంగదేవుడి 947వ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, వారాహి అమ్మవారికి కుంకమ పూజలు నిర్వహించారు. నాటి రాజు పాలన, సైనిక శక్తి, ఆలయాల అభివృద్ధి, శ్రీముఖలింగం రాజధానిగా చేసుకొని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మించిన ఆలయాలు, శాసనాలను ఒడిశా ప్రాజెక్టు అధికారి విష్ణు మోహన్ వివరించారు. నాటి కట్టడాలు విశిష్టతను కటక్ చాపర్ కో కన్వీనర్ దీపక్‌కుమార్ నాయక్ తెలియజేశారు. గంగదేవుడి చిత్రపటాలతో ప్రదక్షిణలు చేసి ఆలయ కార్యాలయంలో భద్రపరిచారు. కళింగ రాజ్యంతోపాటు జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన దానాలు, తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలను పీఏఎస్ కార్యదర్శి, కో కన్వినర్ మురళీధర్, తరుణ్ సింగ్‌లు వివరించారు. భావితరాలకు ఆనాటి రాజుల చరిత్ర తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment