క్రీడల్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడల్‌

Published Wed, Feb 19 2025 1:10 AM | Last Updated on Wed, Feb 19 2025 1:09 AM

క్రీడ

క్రీడల్‌

కళాశాలల్లో

క్రీడలకు దూరం..

నేను ఆలిండియా యూనివర్సిటీ హ్యాండ్‌బాల్‌లో గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ని. గేమ్స్‌లో ఆసక్తితో ఫిజికల్‌ డైరెక్టర్‌ ఉద్యోగంలో చేశాను. స్కూల్స్‌ వరకే పీడీ, పీఈటీలు ఉన్నారు. కాలేజీలకు పూర్తిగా పీడీలు లేరు. గత ప్రభుత్వం హయాంలో నాకు పదోన్నతి లభించింది. హెచ్‌ఎంగా చేరాల్సి వచ్చింది. క్రీడ లకు దూరమైపోయాను. అదే జేఎల్స్‌గా పదోన్నతులు కల్పించి పీడీలుగా నియమిస్తే జూనియర్‌ కాలేజీలు సైతం క్రీడలతో కళకళలాడుతుండేవి.

–ఎమ్మెస్‌ చంద్రశేఖర్‌, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్‌ పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు మండలం

శ్రీకాకుళం న్యూకాలనీ:

విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు శిక్షకులు కావాలి. అందుకు ప్రభుత్వ స్కూళ్లలో పాఠశాల స్థాయిలో పీడీ/పీఈటీలు ఉన్నారు. పాఠశాల స్థాయి తర్వాత జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్లే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 38 ఉంటే.. పనిచేస్తున్న పీడీలు సున్నా. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు, శిక్షకులను నియమించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా శిక్షకులు లేక నిరాశకు లోనవుతున్నారు.కొంతమంది పిల్లలు వివిధ వేదికల్లా రాణిస్తున్నా.. వారి వ్యక్తిగత ప్రతిభతోనే గుర్తింపు పొందుతున్నారు.

నాలుగు గదులకే పరిమితమవుతూ..

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు పీఈటీలు, పీడీలు విద్యార్థులకు క్రీడల పట్ల మంచి శిక్షణ ఇస్తున్నారు. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అయితే వారి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్‌లో చేరేసరికి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడం. సర్కారీ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులు క్రీడలు, వ్యాయామాలకు దూరమైపోతూ నిరంతనం తరగతుల గదులకే పరిమితం అవుతున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్‌, గంజాయి, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. అదే కాలేజీల్లో పీడీలుంటే వ్యాయామం, క్రీడలు, ఆటపాటలపట్ల ఆకర్షితులను చేస్తే మానసిక ఉల్లాసం, ఆనందం కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆగిపోయిన పదోన్నతల ప్రక్రియ..

పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 30 మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఇంటర్మీడియెట్‌ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 38 ఉన్నాయి. వీటిల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు ఒక్కరూ లేరు. పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఎంపీఈడీ కోర్సు పూర్తి చేస్తే పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందేవారు. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు ఉద్యోగోన్నతులపై జూనియర్‌ కళాశాలలకు వెళ్లేవారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతున్నందున ఉద్యోగ పదోన్నతులు రెండు దశాబ్దాలుగా ఆగిపోయాయి. పీఈటీలంతా పాఠశాలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో పీడీలను పాఠశాలల్లో హెచ్‌ఎంలగా పదోన్నతులు కల్పించి నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వారి పేరిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. కానీ న్యాయస్థానాల్లో కేసులు కారణంగా జూనియర్‌ కాలేజీలకు పీడీలగా మాత్రం ఉద్యోగోన్నతలు పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగోన్నతుల ద్వారా ఉన్నత పాఠశాలల్లో పీడీలను జేఎల్స్‌ పీఈగా పదోన్నతులు కల్పించాలని పీడీ, పీఈటీల సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంటర్‌

ఫస్టియర్‌ విద్యార్థులు

జిల్లాలోని

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు

జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న

పీడీలు

ఇంటర్‌

సెకెండియర్‌ విద్యార్ధులు

38

6383

7883

ఉద్యోగోన్నతులు కల్పించాలి..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామకాలను ఉద్యోగోన్నతుల ప్రక్రియ ద్వారా చేపట్టాలి. జూనియర్‌ కళాశాలల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. క్రీడలకు దూరమైపోతున్నారు. జూనియర్‌ కాలేజీల్లో పీడీల నియామకాలు జరిగితే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. – మొజ్జాడ వెంకటరమణ,

పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు

జూనియర్‌ కాలేజీల్లో కనుమరుగవుతున్న ఫిజికల్‌ డైరెక్టర్లు

మొత్తం 38 చోట్ల ఒక్కరూ లేని వైనం

నష్టపోతున్న విద్యార్థులు

పట్టించుకోని ప్రభుత్వం

0

No comments yet. Be the first to comment!
Add a comment
క్రీడల్‌ 1
1/4

క్రీడల్‌

క్రీడల్‌ 2
2/4

క్రీడల్‌

క్రీడల్‌ 3
3/4

క్రీడల్‌

క్రీడల్‌ 4
4/4

క్రీడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement