విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి
ఆమదాలవలస: సొంత భూమి గల ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. జొన్నవలస రైతుసేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. అనంతరం మునగవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమి రికార్డుల వివరాలతో రైతు సేవా కేంద్రంలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, వ్యవసాయ సహయకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment