ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యు
● జిల్ల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు
● మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత
● కట్టడి లేదని అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు
ఆమదాలవలసలో..
●
● బీఆర్‌నగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇటీవల కొంతమంది గంజాయి సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.
● ఒడిశా నుంచి రైళ్లలో బ్యాగుల్లో పట్టుకుని వచ్చి ఎదురుగా ఉండే ఒకట్రెండు లాడ్జీల్లో మకాం వేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో..
● రైల్వేస్టేషన్ శివార్లు, ఎల్‌మ్యాక్స్ సమీప పొదలు, బెల్లుపడ కాలనీ శివారు, పురుషోత్తపురం శివార్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా ఉన్నాయి.
● ఈ ప్రాంతాల్లో ఇటీవల ఎనిమిది మందిని పట్టుకున్నారు.
● కంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో పొట్లాల్లో క్రయ విక్రయాలిప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.
పలాస–కాశీబుగ్గ కేంద్రంగా..
● నగర శివార్లలోని హుద్‌హుద్ ఇళ్లు, కోసంగిపురం జగనన్న కాలనీ, సూదికొండ, నెమలికొండ, రైల్వేస్టేషన్ అంబుసోలి, బెండితోట రిజర్వ్ ఫారెస్టు, రైల్వే గ్రౌండ్‌లో గంజాయి సేవిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి.
● రైల్వేస్టేషన్ సమీప ఆలయాలు, పలాస అన్నపూర్ణ సమీప పరిసరాల వద్ద సాధువులు అమ్ముతుంటారు.
నరసన్నపేటలో..
● ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సులభ్‌కాంప్లెక్సు అడ్డాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.
● జమ్ము జంక్షన్ సమీప పరిసరాల్లోను, బజారులో రాజేశ్వరి టాకీస్ దగ్గర పల్లిపేట జంక్షన్ వెంకటేశ్వర థియేటర్ రాజుల చెరువు గట్టు మీద కాలనీలో, కొన్ని స్లమ్ ఏరియా ఉన్న కాలనీల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.
టెక్కలిలో..
● జాతీయ రహదారి ఆనుకొని నిర్మానుష్య ప్రాంతాలు, తోటలు, ప్రైవేటు లేఅవుట్‌లు, వెంచర్లు, వంశధార కాలువ ఏరియా మత్తుపదార్థాల సేవనానికి కేరాఫ్‌లుగా నిలుస్తున్నాయి.
● టెక్కలిలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులను కలిపే రైలు మార్గం ఉండటం, గుణుపూర్ నుంచే గంజాయి వస్తుందని స్థానికంగా చర్చజరుగుతోంది.
అదేమీ శివారు ప్రాంతం కాదు.. నిర్మానుష్య ప్రాంతం అంతకంటే కాదు. దాదాపు నగరం నడిబొడ్డున.. అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో ఇద్దరు యువకులు గంజాయి తీసుకుంటూ దొరికిపోయారు. అది కూడా వీరు సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే కంట పడ్డారు. మార్కెట్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ వస్తే ఈ బాగోతం బయటపడింది. జిల్లా కేంద్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో ఎమ్మెల్యే సాక్షిగా ఘటన రుజువు చేసింది.
జిల్లా కేంద్రంలో..
నగరంలోని ఉమెన్స్ కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.
డచ్‌బంగ్లా వెనుక ఖాళీ స్థలం కూడా వీరి అడ్డానే.
అఫీషియల్‌కాలనీ ఫైర్ ఆఫీస్, ఆర్‌అండ్‌బీ సమీప సబ్‌పోస్టాఫీస్‌లలో రాత్రి వేళ చూస్తే భయం పుట్టక మానదు.
మత్తులో నేరాలు – ఘోరాలు
జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో నిందితుడిని ఇంటరాగేట్ చేసేందుకు పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. గంజాయి మత్తు దిగాక గానీ అతడు విచారణకు సహకరించలేదు.
గత ఏడాది అక్టోబర్‌లో శ్రీకాకుళంలోనే ఓ యు వకుడిపై మరొకరు బ్లేడుతో గొంతు కోసేశాడు.
ఒడిశాకు చెందిన ఓ యువకుడు పచ్చని కాపురంలో ప్రేమ పేరుతో చిచ్చుపెట్టాడు. మత్తులో ఏకంగా హత్యకు పాల్పడ్డాడు.
మరో ఘటనలో ఓ యువకుడు సొంత మేనమామ తమకు రావాల్సిన వాటాకు అడ్డుగా నిలుస్తున్నాడన్న కోపంతో స్నేహితుని సాయంతో మత్తులోనే కర్కశంగా చంపేశాడు.
ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యు
ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యు
ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యు
Comments
Please login to add a commentAdd a comment