12న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పడక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర యువజన విభాగం అధ్యక్షులు ఎంవీ స్వరూప్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘు, మూకళ్ళ తాతబాబు, పీస గోపి, చల్ల రవికుమార్ లతో పాటు అధిక సంఖ్యలో పార్టీముఖ్య నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment