హెల్త్‌సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్‌సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాల ని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు.దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment