మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా శ్రీకాకుళం
శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి శ్రీకాకుళాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. అనంతరం పలువురు మహిళలకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు, చెక్‌లు, బాలికలకు ల్యాప్‌టాప్‌లు, మహిళా డ్రైవర్లకు ఆటోలు అందజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, సీపీవో ప్రసన్నలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కె.కవిత, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ.అనురాధ, పలు విభాగాలకు చెందిన మహిళ ఉద్యోగులు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment