విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
పాతపట్నం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు హెచ్చరించారు. మండల కేంద్రంలోని రేషన్ డిపోలు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(ఎండీయూఎస్), బూరగాంలోని రేషన్ షాపు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనం సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్, సీడీపీవో టి.విమలారాణి, ఏఎస్‌డబ్ల్యూవో ఎం.శ్యామల, ఎస్‌ఎస్‌ఏ జీసీడీవో ఎస్.నీరజ, ఎంఈవో–2 సీహెచ్ తిరుమలరావు, సీఎస్‌డీటీలు ప్రసాదరావు, చక్రవర్తిలు, ఆర్‌ఐ బాబి, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు సూర్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు అనూరాధ, ఉషారాణి తదితరులు ఉన్నారు.
మెళియాపుట్టి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిటీ సభ్యుడు బి.కాంతారావు సూచించారు. మండలంలోని కేజీబీవీ, చాపర ఎస్సీ హాస్టల్, ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాపర ఎస్సీ వసతి గృహంలో రికార్డులు, నిల్వ ఉన్న సామగ్రిలో తేడాలున్నట్లు గుర్తించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, వార్డెన్‌కు మెమో జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ పాపారావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment