
పేదల పక్షపాతి వైఎస్సార్ సీపీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాష్ట్రంలో పేదల కన్నీళ్లు, నిరుపేద ల కష్టాలు తీర్చాలన్న దృఢ సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011లో వైఎస్సార్ సీపీని ప్రారంభించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ముందు గా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు తట్టుకోలేకపోతున్నార ని చెప్పారు. చంద్రబాబుని ఎప్పుడు గద్దె దింపుదా మా అని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన నాయకుడు వైఎస్ జగన్
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో
జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
Comments
Please login to add a commentAdd a comment