
గృహ నిర్మాణాలకు అదనపు సాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను నిర్మించుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అదనపు సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2029 నాటికి ‘అందరికీ గృహ నిర్మాణం‘ అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సాయం అందిస్తామన్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు యూనిట్ ధర కంటే అదనంగా రూ.50,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75,000, పీవీటీజీ (పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబుల్ గ్రూప్) లబ్ధిదారులకు రూ.1,00,000 చెల్లించనున్నట్లు వివరించారు. 2024 డిసెంబర్ 10 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment