
యువత పోరుకు విశేష స్పందన
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు
ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు
ప్రభుత్వ తీరు దుర్మార్గం
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్ సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కూటమి సర్కారు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది. మెడికల్ సీట్లు కూడా వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దురదృష్టకరం. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం తగదు. ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి.
– తమ్మినేని సీతారాం, మాజీ శాసన సభాపతి
● కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు
● వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
● సర్కారు ఉక్కుపాదం మోపినా
వెనక్కి తగ్గని పరిస్థితి
● ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ
నినాదాల హోరు
● బాబు మోసం గ్యారెంటీ:
పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్
● బాబు ధ్యాసంతా అమరావతిపైనే:
మాజీ మంత్రి సీదిరి
● నిరుద్యోగులను నట్టేట ముంచారు:
మాజీ స్పీకర్ తమ్మినేని
●
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్ :
కూటమి ప్రభుత్వ మోసాలపై యువత గర్జించింది. తమకు మద్దతుగా పోరు సాగిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించింది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న పాలకుల తీరును తీవ్రంగా ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో తొలుత బకాయి ఫీజులు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ.. బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి.. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామా రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాలకు సరిపడా నిధులను బడ్జెట్ కేటాయింపులు పెంచి సకాలంలో వాటిని విడుదల చేయాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి మోసాలపై భవిష్యత్‌లో ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
కార్యక్రమంలో యువజన విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్, తూర్పుకాపు, కళింగ వైశ్య కులాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి సత్యనారాయణ, డాక్టర్స్‌సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, కార్యదర్శి సీపాన వెంకటరావు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ధర్మాన కృష్ణచైతన్య, తమ్మినేని చిరంజీవినాగ్, మార్పు పృథ్వీ, ముంజేటి కృష్ణమూర్తి, ఎంఏ బేగ్, లోలుగు కాంతారావు, గొండు కృష్ణ, చిట్టి జనార్దన, సాదు వైకుంఠరావు, గొండు రఘు, శాడి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రత్తి అన్వేష్, బల్లాడ జనార్దన్ రెడ్డి, పిన్నింటి సాయి, రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, సీపాన రామారావు, రుప్ప దివ్య, వై.వి.శ్రీధర్, బొడ్డేపల్లి పద్మజ, బొడ్డేపల్లి రమేష్, గుండ హరీష్, టి.కామేశ్వరి, యజ్జల గురుమూర్తి, ఖండాపు గోవిందరావు, కోట గోవిందరావు, పప్పల రమేష్, పీస శ్రీహరి, పీస గోపి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమణ, పప్పల పారినాయుడు, సనపల బాబూరావు, తమ్మినేని మురళి, బెండి గోవిందరావు, తమ్మినేని శ్రీరామ్మూర్తి, బాడాన సునీల్, వాడన కృష్ణ, దుంపల గోవిందరావు, సీహెచ్ భాస్కరరావు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారు
కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చింది. నిరుపేద విద్యార్థులను, నిరుద్యోగ యువతకు అమలుచేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎం చంద్రబాబునాయుడు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు రాసేందుకు యాజమాన్యాలు హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. నిరుద్యోగులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అరకొరగా కేటాయింపులు
గత ఏడాది ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థులకు ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అధికారంలోకి వచ్చాక ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన పథకాలకు ఏటా రూ.3,900 కోట్లు కావాలి. ఇప్పటికే ఉన్న బకాయిలు రూ.3,200 కోట్లు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సింది మరో రూ.3,900 కోట్లు. మొత్తం కావాల్సింది రూ. 7,100కోట్లు. ఈ బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ 2,600 కోట్లే. నిరుద్యోగ భృతి పేరిట కూడా యువతను మోసగించారు. బాబు ధ్యాసంతా అమరావతిపైన తప్ప మెడికల్ కాలేజీలపై లేదు.
– డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేస్తున్న ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ, నర్తు రామారావు, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్, చింతాడ ర వికుమార్ తదితరులు
యువతరం ఉత్తుంగ తరంగమై కదం తొక్కింది. కూటమి సర్కారు మోసపూరిత వైఖరిని గొంతెత్తి గర్జించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలను విస్మరించిన చంద్రబాబు సర్కారు తీరుపై నిరసనలతో హోరెత్తించింది. వైఎస్సార్సీపీ పిలుపునకు యువత నుంచి లభించిన అనూహ్య స్పందన తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వంపై యువతలో పెరిగిన అసంతృప్తికి యువత పోరు ఉద్యమం దర్పణం పట్టింది.

యువత పోరుకు విశేష స్పందన

యువత పోరుకు విశేష స్పందన

యువత పోరుకు విశేష స్పందన

యువత పోరుకు విశేష స్పందన
Comments
Please login to add a commentAdd a comment