వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
మందస: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌తో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాహుల్ మండల్ తమిళనాడు రాష్రం ఈరోడ్ పట్టణంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ రంజిత్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. అతని సూచన మేరకు ఒడిశా రాష్ట్రం పారదీప్ వెళ్లి భానోజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మందస రాగా రైల్వేస్టేషన్ వద్ద ఎస్‌ఐ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం పట్టుకున్నారు. రాహుల్ వద్ద 4 కేజిల 132 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు.
ప్రైవేటు వాహనంలో తరలిస్తూ..
నరసన్నపేట: పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్ గుల్ఫాన్ నాలుగు కేజీల గంజాయితో గురువారం పట్టుబడ్డాడు. హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయివేటు వాహనాన్ని అనుమానంతో దేవాది వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు.
వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
Comments
Please login to add a commentAdd a comment