
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒంటి పూట బడులకు వేళయ్యింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి ఉద యం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు.
జిల్లాలో వసతి గృహాలు మినహా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్‌స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్‌పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు వర్తించనున్నాయి.
అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలను ఇళ్లకు విడిచిపెడతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒంటిపూట సందర్భంగా బడుల్లో తగి నంత తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉపయోగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment